'ఛత్రపతి శివాజీ యువతకు ఆదర్శం'
MDK: రేగోడ్ మండలం జగిర్యాలలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకుడు బస్వరాజు మాట్లాడుతూ.. శివాజీ స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. దేశభక్తి, ధైర్యసాహసాలకు శివాజీ ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని రమేశ్ పాల్గొన్నారు.