మిస్సింగ్ కేసును ఛేదించిన మైలవరం ఎస్సై

మిస్సింగ్ కేసును ఛేదించిన మైలవరం ఎస్సై

KDP: మైలవరం (M) బుచ్చంపల్లెకు చెందిన మూడే తేజేశ్వరి, జూన్ 19న భర్త వేధింపుల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్యామ్ సుందర్ రెడ్డి, దర్యాప్తు ముమ్మరం చేసి మిస్సింగ్ కేసును ఛేదించారు. మైలవరం MRO సమక్షంలో తేజేశ్వరికి కౌన్సెలింగ్ నిర్వహించి, ఆమెను భర్తకు, కుటుంబసభ్యులకు అప్పగించారు.