కడపలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

కడప నగరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ద్వారకా నగర్ మురళీకృష్ణ ఆలయంతో పాటు భాగ్యనగర్ కృష్ణాలయాల్లో భక్తులు పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి దర్శనాలు కల్పించారు.