'మడకశిరలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి'
సత్యసాయి: మడకశిర నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు పాల్గొన్నారు. అక్రమ కట్టడాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బలవంతులకు సహకరిస్తూ, బలహీనులను తొక్కిపెట్టడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టెండర్లు లేకుండా చేసిన పనులపై విజిలెన్స్ విచారణకు నివేదిక పంపారా? అని ఆరా తీశారు.