IDSMT లేఔట్‌లో ఖాళీ ప్లాట్ల వేలంపాట

IDSMT లేఔట్‌లో ఖాళీ ప్లాట్ల వేలంపాట

KRNL: కావలి మున్సిపాలిటీ పరిధిలోని బాపూజీ నగర్ IDSMT లేఔట్‌లో ఉన్న ఖాళీ ప్లాట్లను విక్రయించడానికి మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఖాళీ ప్లాట్ల కోసం జనవరి 6వ తేదీన వేలంపాటను నిర్వహించనున్నారు. వేలంలో ప్లాట్లను కొనుగోలు చేయాలనుకునే స్థానిక ప్రజల కోసం, కొనుగోలు విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.