పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

హనుమకొండ లస్కర్ బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.