VIDEO: MGM ఆసుపత్రిని సందర్శించిన కవిత
WGL: జిల్లా కేంద్రంలోని MGM ఆసుపత్రిని శనివారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, స్థానిక నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జనరల్, ICU వార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సదుపాయాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.