'మహిళా భద్రతపై సైకిల్ యాత్ర అభినందనీయం'
ATP: మహిళా భద్రత, పోక్సో చట్టంపై అవగాహన కోసం మంజునాథ్ చేపట్టిన సైకిల్ యాత్ర అనంతపురానికి చేరుకుంది. హిందూపురం నుంచి అమరావతి వరకు సాగే ఈ యాత్రను మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి అభినందించారు. సమాజంలో బాలికలు, మహిళల రక్షణపై చైతన్యం తెచ్చేందుకు ఆయన చేస్తున్న కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.