‘నెల రోజుల్లోగా మొదలు పెట్టాలి’

‘నెల రోజుల్లోగా మొదలు పెట్టాలి’

ASR: ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలను నెల రోజుల్లోగా మొదలు పెట్టాలని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ బీ.బాబు నాయక్ లబ్దిదారులకు సూచించారు. లేకుంటే మంజూరైన ఇళ్లు క్యాన్సిల్ అయిపోతాయని స్పష్టం చేశారు. శుక్రవారం కొయ్యూరు మండలం చింతలపూడిలో పర్యటించి, ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.