అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కమిషనర్

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్న క్యాంటీన్‌ను మంగళవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో ఉన్న ఆహార పదార్థాల ప్రమాణాలను పర్యవేక్షించారు. క్యాంటీన్లో భోజనం చేస్తున్న పలువురితో ఆయన మాట్లాడి ఆహార పదార్థాల రుచి, నాణ్యత గూర్చి అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ నిర్వహణ పట్ల సంతృప్తి చెందారు.