VIDEO: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ మంత్రి
JGL: మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించారు. ఏ అంశమైనా మీడియాకు తెలియకుండా జరగదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజే పరిస్థితి గురించి చెప్పానన్నారు. కాంగ్రెస్‌లో కొనసాగాలా వద్దా అనే విషయంపై ఆలోచిస్తున్నానని, సమయం వచ్చినప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.