VIDEO: కాకినాడలో కదలని ఆర్టీసీ బస్సులు
KKD: కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీ డిపో నుంచి గురువారం బస్సులు కదలలేదు. దీంతో బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. కార్మికులు బస్టాండ్‌కు చేరుకుని బస్సులకు అడ్డంగా నిలబడి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.