'హీరో' పదం డ్రగ్ కంటే డేంజర్: సీఎంలకు లేఖ
PLD: సినిమాల్లో 'హీరో' అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరమని, యువతను పెడదోవ పట్టిస్తోందని చిలకలూరిపేట సామాజికవేత్త భాను ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తెలుగు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. నటులను 'హీరో' అని కాకుండా 'కథానాయక పాత్రధారి' అని పిలవాలని, స్టార్ బిరుదులను నియంత్రించాలని కోరారు. థియేటర్లలో ఎంఆర్పీ ధరలు, ఉచిత పార్కింగ్ అమలు చేయాలని అన్నారు.