ఉత్తమ లెక్చరర్‌గా డా.ఫైజుల్లా గుర్తింపు
అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉర్దూ లెక్చరర్‌గా పనిచేస్తున్న డా. మహమ్మద్ ఫైజుల్లాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ రాష్ట్ర స్థాయి ఉత్తమ లెక్చరర్ అవార్డు లభించింది. ఇందులో భాగంగా జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.డి. ఫారూక్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.