VIDEO: పాచిపెంటలోతాగునీరు పైపు లీకేజ్
PPM: పాచిపెంట మండలంలో వివిధ గ్రామాలకు సరఫరా చేసే తాగునీరు పైపు లీక్ అవుతుంది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో కర్రివలస కూడలిలో తాగునీరు పైపు లీక్ అయ్యి వరదలా రోడ్డుపై పారుతుంది. పెద్దగెడ్డ ప్రాజెక్టు నుంచి కర్రివలస, అమ్మవలస, కొనవలస తదితర గ్రామాలకు ఈ పైపు ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.