'రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండాలి'

'రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండాలి'

KMR: జిల్లాలో నెలకొన్న తీవ్రమైన పొగమంచు నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం సూచించారు. తక్కువ వీక్షణ సామర్థ్యం కారణంగా ఎదురు వాహనాలు, పాదచారులు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పొగమంచు సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఎస్పీ హెచ్చరించారు.