'పిల్లల పోషకాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

'పిల్లల పోషకాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

E.G: తక్కువ బరువు, తగిన ఎత్తు లేకపోవడం, బలహీన స్థితి వంటి సమస్యలు ఉన్న చిన్నారులపై అంగన్వాడీ కేంద్రాలలో ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా శిశు సంరక్షణ విభాగం పనితీరుపై ఆమె ఇవాళ సమీక్షించారు. పిల్లల పోషకాహార స్థితిని క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు.