నేడు శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ

NDL: ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో ఆదివారం దేవస్థానం సర్కారీ సేవ పూజలో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ కార్యక్రమాన్ని జరపనున్నారు. ఆ తర్వాత ఊయల సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదేవిధంగా రాత్రి 7 గంటల సమయానికి ఆలయ దక్షిణ మాడ వీధిలోని నిత్య కళారాధన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.