పోలీసు నిజాయతీ.. పర్సు అప్పగింత
PPM: హైదరాబాద్‌కు చెందిన ఎం. వేణుగోపాల రావు పర్సు పోగొట్టుకున్నారు. అది బలిజిపేట పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బి. త్రినాథకు దొరికింది. ఆయన దాన్ని నిజాయతీగా పట్టణ పోలీసు స్టేషన్‌కు అప్పగించి, వివరాలు సేకరించి బాధితునికి సమాచారం ఇచ్చారు. పర్సులో రూ. 5,200 నగదు, ఏటీఎం కార్డులను బాధితునికి పట్టణ స్టేషన్‌లో అందజేశారు.