పెద మానాపురం గ్రామంలో హౌస్ టు హౌస్ ఓటర్ల సర్వే

పెద మానాపురం గ్రామంలో హౌస్ టు హౌస్ ఓటర్ల సర్వే

VZM: గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని దత్తరాజేరు మండలం పెద మానాపురం పోలింగ్ స్టేషన్ 9, 10, 11 లలో హౌస్ టు హౌస్ జరుగుతున్న ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఈఆర్వో ప్రమీల గాంధీ పరిశీలించారు. పది రోజుల్లో బిఎల్వోలు ఇంటింటి ఓటర్ల సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. చనిపోయిన ఓటర్లను గుర్తించి తొలగించడంతోపాటు నూతన ఓటర్లను చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.