మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ
NZB: జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు సంబంధించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఆయన లేఖ రాశారు. జిల్లాలో ఈ ఏడాది పెద్ద ఎత్తున మక్క సాగు జరిగిందని ఎంపీ అన్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.