కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్

కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్

WNP: పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సరైన వేదిక అని వనపర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రజని అన్నారు. వనపర్తి జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో కేసులు పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ నెల 15న నిర్వహించే లోక్ అదాలతన్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.