రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

KMM: కల్లూరు మండలానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రబోయినపల్లికి చెందిన RMP శేఖర్ కుమారుడు చిత్రాల సింధూర్(35) హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. శనివారం రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నట్లు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.