హైవేపై ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

NLR: మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆటోని కారు ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. మండలంలోని మడమనూరు గ్రామానికి చెందిన ఉప్పు శ్రీనివాసులు కూరగాయల వ్యాపారి. కూరగాయల కోసం ఆటోలో నెల్లూరు వెళుతుండగా వెనకనుంచి వేగంగా కారు ఢీకొంది. దీంతో శ్రీనివాసులు తలకు తీవ్ర గాయాలై అక్కడకక్కడే చనిపోయాడు.