చవితి ఉత్సవాలపై సబ్ కలెక్టర్ సూచనలు

ELR: నూజివీడు డివిజన్‌లో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, ధ్వని కాలుష్యం లేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.