భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు జలకళ

భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు జలకళ

ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నాటికి 1650.2 అడుగుల మేర నీరు వచ్చి చేరిందని జల వనరుల శాఖ ఏఈ హరీష్ తెలిపారు. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద కొనసాగుతోందన్నారు.