వేధింపులు తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య
NRML: ఖానాపూర్ మండలంలో బండారి రవీందర్ (54) అనే సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన రవీందర్ తన భార్య పుష్పను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే, పోటీ నుంచి తప్పుకోవాలని కొందరు నాయకులు ఒత్తిడి తెచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.