దుర్గామాత నిమజ్జనంలో విషాదం.. నదిలో ఒకరు గల్లంతు

ADB: దుర్గాదేవి విగ్రహ నిమజ్జనంలో విషాదం నెలకొంది. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి పెన్ గంగా నదిలో గల్లంతైన విషాద ఘటన ADBలో చోటుచేసుకుంది. సోమవారం రణదీవే నగర్ కాలనీకి చెందిన గజ్జు అనే వ్యక్తి దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి జైనథ్ మండలంలోని డొలారా వద్ద గల పెన్ గంగా నదికి వెళ్లారు. దీంతో ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు.