పోలీస్ అమరవీరులకు క్యాండిల్ ర్యాలీ

పోలీస్ అమరవీరులకు క్యాండిల్ ర్యాలీ

KNR: పోలీసు అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకుంటూ శుక్రవారం కరీంనగర్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ, పోలీసు హెడ్ క్వార్టర్స్ లోని అమరవీరుల స్థూపం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో సీపీ గౌష్ ఆలం పాల్గొన్నారు.