తెనాలిలో మున్సిపల్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు

తెనాలిలో మున్సిపల్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు

GNTR: తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డా. అగర్వాల్ ఐ క్లినిక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ లక్ష్మీపతి ప్రారంభించారు. ఈ శిబిరంలో ఛైర్‌పర్సన్, కమిషనర్‌తో పాటు మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.