VIDEO: జాతీయ రహదారిపై పొంగిపొర్లుతున్న నీరు
W.G: నరసాపురంలో కురిసిన భారీ వర్షానికి పంట కాలువలోని నీరు పొంగిపొర్లి 216 జాతీయ రహదారిపైకి ప్రవహిస్తోంది. దీంతో నర్సాపురం పాలకొల్లు రహదారిలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో, నీరు బయటకు వెళ్లక పంట కాలువలు పొంగాయి. అధికారులు వెంటనే స్పందించి, చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.