VIDEO: కామారెడ్డిలో ఐదుగురు చిన్నారులు మిస్సింగ్
KMR: జిల్లా కేంద్రంలో ఐదుగురు చిన్నారులు కనిపించకుండా పోవడంతో స్థానికంగా కలకలం రేపింది. గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి (10), విజయ్ (9), ఆర్బీ నగర్ కాలనీకి ముగ్గురు అక్క చెల్లెలు సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) అదృశ్యమయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు KMR పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి సీసీ కెమెరాల ఆధారంగా మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.