ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం: ఎస్సై

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం: ఎస్సై

కృష్ణా: కోడూరు ఎస్సై కె. చాణక్య విశ్వనాథపల్లి గ్రామాన్ని బుధవారం సందర్శించారు. గ్రామ ప్రజలతో సమావేశమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సైబర్ నేరాల నివారణ, డయల్ 112 సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112 ద్వారా పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని అన్నారు.