VIDEO: కాలువ పనులకు శంకుస్థాపన

SKLM: లావేరు మండలంలోని బుడుమూరులో కాలువలు లేక మురికి నీరు వీధుల్లో నిలిచిపోవడం సమస్యను ఇటీవల ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు, స్థానికులు తీసుకెళ్లారు. స్పందించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం ఉదయం గ్రామంలో కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. తదనంతరం అక్కడ ప్రజలకు ఎదురవుతున్న సమస్యల అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.