కాంగ్రెస్, బీఆర్ఎస్ ఘర్షణ.. ఒకరు మృతి
SRPT: నూతనకల్ (M) లింగంపల్లిలో BRS కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు BRS కార్యకర్తలపై ముప్పేట దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఉప్పల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, ఈ దాడిలో BRS మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్‌తో పాటు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.