గోకాఫసల్వాడ్‌లో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం
VKB: గోకాఫసల్వాడ్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ బాణదేశ్వర ఇండస్ట్రీస్ అధినేతలు శ్రీ సిద్ధేశ్వర్, ఏ. రాజ్‌కుమార్ సోదరులు ఈ కళ్యాణ తంతును భక్తిశ్రద్ధలతో నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.