జిల్లాకు మరో మూడు అన్న క్యాంటీన్‌లు

జిల్లాకు మరో మూడు అన్న క్యాంటీన్‌లు

KKD: జిల్లాలోని రూరల్ ప్రాంతాల్లో కొత్తగా మూడు అన్న క్యాంటీన్‌లు ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. కాకినాడ జీజీహెచ్‌కు వచ్చే రోగుల కోసం మరో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.