అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

PDPL: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. అలాగే అర్హులైన 49 మందికి తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేశారు.