నిధులు ఉన్న పూర్తికాని ప్రభుత్వ పాఠశాల భవనం
SKLM: కొత్తూరు మండలం అద్దంకి పంచాయతీ లంబసింగిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని తక్షణమే నిర్మాణం చేపట్టాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా శాఖ అధ్యక్షులు డి.చందు అన్నారు. మంగళవారం స్థానిక మండల తహసీల్దార్‌కు దరఖాస్తు సమర్పించారు. 2012 సంవత్సరంలో నిధులు మంజూరు చేసినా నిర్మాణం పూర్తికాలేదని ఆయన అన్నారు.