వైభవంగా బోనాలు.. ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు

RR: షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామంలో మల్లికార్జున స్వామి బోనాల పండుగను నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో మల్లికార్జున స్వామికి బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మంజుల మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజుల విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.