జలమయమైన ప్రధాన రోడ్డు

జలమయమైన ప్రధాన రోడ్డు

మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ రోడ్డులో గల పూల సుబ్బయ్య కాలనీలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్డంతా జలమయమైంది. రోడ్డు కుంటలతో నిండి ఉండటంతో నీరంతా అక్కడే నిలిచిపోయిందని స్థానికులు వాపోయారు. కాలనీ నిర్మాణం జరిగి 40 సంవత్సరాలు అవుతున్నా కనీస డ్రైనేజ్ కాలువలు కూడా నిర్మించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వరద నీరు వల్ల దోమలు వ్యాపిస్తున్నాయన్నారు.