జగన్నాధపురంలో అగ్నిప్రమాదం
W.G: తాడేపల్లిగూడెం (M) జగన్నాధపురం కరగట్టు ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి తాటాకిల్లు దగ్ధమైందని ఫైర్ ఆఫీసర్ మురళీ కొండబాబు మంగళవారం తెలిపారు. ఈ ప్రమాదంలో పాతాళ ధనరాజుకు చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసినట్లు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు.