విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్‌కు ఘన నివాళి
VSP: విశాఖలోని విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ పోలవరపు అప్పలరాజు సంస్మరణ సభ శనివారం జరిగింది. అక్టోబర్ 28న మరణించిన రాజు మృతి విశాలాంధ్ర బుక్ హౌస్‌కు తీరని నష్టమని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జేవీ. సత్యనారాయణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం. పైడిరాజు, నేతలు ఎస్. మురళి, వై. రాంబాబు పాల్గొన్నారు.