'నాటు సారా స్వాధీనం.... ఇద్దరు అరెస్ట్'

VZM: గజపతినగరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల సీఐ జనార్దనరావు ఆధ్వర్యంలో గురువారం పెట్రోలింగ్ నిర్వహించగా ఆండ్ర గ్రామ శివారులో చెప్పల పోలమ్మ 2 లీటర్ల నాటు సారాతో పట్టు పడగా, లోతుగడ్డ గ్రామ శివారులో గుమ్మడాపు రమణమ్మ 2 లీటర్ల నాటసారాతో పట్టుబడ్డారు. పట్టుబడిన వారిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ దాడిలో ఎస్సై నరేంద్ర కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.