LHPS రాష్ట్ర కార్యదర్శిగా జాదవ్ అశోక్ నాయక్

LHPS రాష్ట్ర కార్యదర్శిగా జాదవ్ అశోక్ నాయక్

NRML: లంబాడి హక్కుల పోరాట సమితి(LHPS)రాష్ట్ర కార్యదర్శిగా జాదవ్ అశోక్ నాయక్‌ను నియమిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు ముదావత్ రాంబాల్ నాయక్‌లు ఆదివారం నియామక ఉత్తర్వులు అందించినట్లు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గోవింద్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అశోక్ నాయక్‌ను జిల్లా నాయకులు అభినందించారు.