28న విశాఖలో భారత్, న్యూజిలాండ్ 4వ టి20 మ్యాచ్
VSP: జనవరి 28న విశాఖలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరగనున్న భారత్–న్యూజిలాండ్ 4వ టి20 మ్యాచ్ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి నేతృత్వంలో భద్రత, ట్రాఫిక్, మైదానం నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 23 సాయంత్రం 5 గంటల నుంచి జొమాటో యాప్ ద్వారా ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయి.