శరవేగంగా కొనసాగుతున్న పుష్కర పనులు

BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న పుష్కరాల కోసం సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 కోట్లతో చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయి. వీఐపీ ఘాట్ ఆవరణలో నిర్మిస్తున్న పుష్కర ఘాటు పనులను అధికారులు వేగంగా నిర్వహిస్తున్నారు.