ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ధూళిపాళ్ల
GNTR: పొన్నూరు మండలం మామిళ్లపల్లిలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శుక్రవారం సందర్శించారు. రోగులకు వైద్యం అందించే విధానాన్ని, మందుల లభ్యతను అడిగి తెలుసుకున్నారు. వర్షా కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.