R1 సిగ్నల్ వద్ద వాహనం బ్రేక్ డౌన్..!
RR: శంషాబాద్ నుంచి ఆరంఘర్ వెళ్లే మార్గంలో R1 సిగ్నల్ వద్ద వాహనం బ్రేక్ డౌన్ అయినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు మెల్లగా ముందుకు కదులుతున్నట్లుగా తెలిపారు. అటువైపు ప్రయాణించే వాహనదారులు ఈ విషయాన్ని గమనించి వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళటం మంచిదని సైబరాబాద్ పోలీసులు సూచించారు.