VIDEO: శనీశ్వర స్వామిని దర్శించిన సివిల్ జడ్జి

E.G: కొత్తపేట మండలం మందపల్లిలో ఉన్న శనేశ్వర స్వామి వారిని ఇవాళ కొత్తపేట జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి హిమబిందు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.